నా గతం.
నా వ్యక్తిగతం.
ఎవరికీ వినిపించని నా స్వగతం.
వర్తమానపు పొరల్లో...గుండె లోతుల్లో...పాతిపెట్టిన మనోగతం.
జీవితగమనం లో ప్రతి అపజయం ఓ ఆశనిపాతం
ఒక్కోసారి అవుతుంది తట్టుకోలేని శరాఘాతం.
తనని / తాను ప్రేమించే మనిషికి తన ప్రేమని తెలియపరచటం చేతకాదు.
తనని/తను ద్వేషించే వారికి దూరమవటం కూడా చేతకాదు.
కష్టాల్లో, బాధల్లో, ఎందుకు నవ్వు వస్తుందో తెలియదు.
ఊహించని విధంగా మంచి జరిగినా..సంతోషం కలిగినా.. కన్నీళ్లు ఎందుకోస్తాయో అంతకంటే తెలియదు.
మనుషుల మధ్య తిరుగుతున్నా ఏదో తెలియని ఒంటరితనం.
ఒంటరిగా ఉన్నా జనం మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న లాంటి ఫీలింగ్.
తనకేం కావాలో తనకే తెలియని సందిగ్ధ మానసం.
తెలియచెప్పే మనసు కోసం, మనసున్న మనిషి కోసం, ఆ మనిషి స్పర్స కోసం, తన అన్వేషణ అనంతం.
Sunday, September 27, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment