Thursday, September 3, 2009

దీన్ని ఐరనీ అనాలో లేక ఎలిజీ అనాలో తెలియదు.

అది పందొమ్మిదివందల నలభైతోమ్మిదవ సంవత్సరం,జూలై నెల తొమ్మిదో తారీఖు.
ఆరోజున ఈ భూమ్మీద ఇద్దరు మనుషులు పుట్టారు.(అంటే ఇంకెవరూ పుట్టలేదని కాదు.నాకు తెలిసినంత
వరకూ అని.)
అంటే వాళ్ళిద్దరూ ఒకే రోజు,ఒకే సమయం లో,ఇంకా చెప్పాలంటే,ఒకే నక్షత్రం లో పుట్టారు.
అలా అరవై ఏళ్ళు గడిచాయి.
ఈ అరవై ఏళ్లలో ఒకడు అనామకుడైతే , మరొకడు అంతెత్తున ఎదిగిపోయాడు. అధినేత అయ్యాడు. ఏకంగాముఖ్యమంత్రే ఐపోయాడు.
అయితే ఏమిటి? సో వాట్? అని విసుక్కోకండి.
ఆ అధినేత , నిన్న, అంటే సెప్టెంబర్ రెండో తారీఖున ఒక ప్రమాదం లో దారుణంగా, భయానకం గా ,అతిదయనీయమైన పరిస్తితి లో మరణించాడు.
ఆ మరణించినవ్యక్తి ఎవరో కాదు! డా. వై .ఎస్.రాజశేఖర రెడ్డి.
ఇకపోతే రెండో వ్యక్తి ..అంటే అనామకుడు ఎవరో కాదు..నేనే!
అందుకే ఈ సంగతి నా అ.ఆ లో (అనామకుడి ఆలోచనలు) చోటు చేసుకుంది.

కొసమెరుపు: నిర్దోషులు అయినా.. నిస్సహాయులైన జనం న్యాయం కోసం హాహాకారాలు చేస్తుంటే, కీ.శే.ముఖ్యమంత్రి గారు తరచూ వినిపించే సుభాషితం అనామకుడి చెవుల్లో గింగురు మంది . "చట్టం తన పని తాను చేసుకు పోతుంది."
అనామకుడు తనలో తాను గొణుక్కున్నాడు.
"దేవుడు తన పని తాను చేసుకు పోతున్నాడు."



No comments:

Post a Comment